For English click here
ఈ గాయత్రీ సుప్రభాతం గాయత్రీ దేవికి రచించ బడిన సుప్రభాతాలలో మొట్ట మొదటిది.
గాయత్రీ సుప్రభాతాలన్నింటిలోకీ అత్యంత జగత్ప్రసిద్ధమైనది. శ్రీ సీతారామాంజనేయులు గారికి ఆయన రచనలన్నింటిలోకీ ఎక్కువ జగత్ప్రసిద్ధిని సంపాదించి పెట్టింది. మిగిలిన దేవతల సుప్రభాతాలూ గాయత్రీ దేవికి ఈ సుప్రభాతం తరువాత ఇతరులు రచించిన సుప్రభాతాలూ కూడా రూపవర్ణనలూ పౌరాణిక కథాంశాల వర్ణనలతో కూడినవి. కాని ఈ స్తోత్రంలో తాత్త్విక వర్ణనలే అత్యధికాంశంగా ఉండటం వల్ల ఇది అలా తాత్త్విక వర్ణనలతో నిండిన అరుదైన స్తోత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇతర దేవతల సుప్రభాతాలలో ఉదయసంధ్యా కాలపు ప్రకృతి వర్ణన నేపథ్య వర్ణనే. కాని ఆ ఉదయ సంధ్య గాయత్రీ త్రిరూపాలలో ఒకటి కదా! కనుక ఇక్కడి ఉదయ సంధ్యాకాలపు వాతావరణ వర్ణన ఇక్కడ వర్ణించబడుతున్న దేవతాతత్త్వపు వర్ణనే కావడం ఈ స్తోత్రపు మరొక ప్రత్యేకత.
‘కౌసల్యా సుప్రజ’ అయిన రాముడు ఏ ‘ఆహ్నిక’మైన ‘కర్తవ్యం’ కోసం విశ్వామిత్రుడి చే మేల్కొలుప బడ్డాడో ఆ ‘పూర్వసంధ్యా’ గతతత్త్వమే ‘పూర్వసంధ్యా’ వాతావరణంగా ఇక్కడ వర్ణించబడింది. ఆ విశ్వామిత్రుడు దర్శించిన తత్త్వమే ఇక్కడ వర్ణించ బడింది.
ఏ కృత్రిమతా లేని వైదిక నిసర్గ సౌందర్యాల ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది ఈ స్తోత్రం.
శ్రీ గాయత్రీ సుప్రభాత స్తోత్రం
|| శ్రీరస్తు ||
శ్రీ జాని రద్రితనయాపతి రబ్జగర్భః
సర్వే చ దైవతగణాః సమహర్షయోమీ |
ఏతే చ భూతనిచయాః సముదీరయన్తి
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧||
పుష్పోచ్చయ ప్రవిలస త్కరకంజయుగ్మామ్
గన్గాది దివ్య తటినీ వరతీరదేశే |
ష్వర్ఘ్యమ్ సమర్పయితుమత్రజనాస్తవైతే
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨||
కర్ణేమృతమ్ వికిరతా స్వరసంచయేన
సర్వే ద్విజాః శ్రుతిగణమ్ సముదీరయన్తి |
పశ్యాశ్రమాసథ వృక్షతలేషు దేవి
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౪||
గావో మహర్షినిచయాశ్రమ భూమిభాగాత్
గన్తుమ్ వనాయ శనకైః శనకైః ప్రయాన్తి |
వత్సాన్ పయోమృతరసమ్ నను పాయయిత్వా
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౪||
శిష్య ప్రబోధనపరా వర మౌని ముఖ్యాః
వ్యాఖ్యాన్తి వేదగదితమ్ స్ఫుట ధర్మ తత్త్వమ్ |
స్వీయాశ్రమాంగణ తలేషు మనోహరేషు
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౫||
శ్రోత్రామృతమ్ శ్రుతిరవమ్ కలయన్త ఏతే
విస్మృత్య గన్తుమటవీమ్ ఫలలాభలోభాత్ |
వృక్షాగ్ర భూమిషు వనేషు లసన్తి కీరాః
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౬||
మూర్తిత్రయాత్మకలితే నిగమ త్రయేణ
వేద్యే స్వరత్రయ పరిస్ఫుట మన్త్రరూపే |
తత్త్వ ప్రబోధనప రోపనిష త్ప్రపంచే
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౭||
విశ్వాత్మికే నిగమశీర్షవతంసరూపే
సర్వాగ మాన్త రుదితే వర తైజసాత్మన్ |
ప్రాజ్ఞాత్మికే సృజన పోషణ సంహృతిస్థే
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౮||
తుర్యాత్మికే సకలతత్త్వగణానతీతే
ఆనన్ద భోగ కలితే పరమార్థదాత్రి |
బ్రహ్మానుభూతివరదే సతతమ్ జనానామ్
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౯||
తారస్వరేణ మధురమ్ పరిగీయమానే
మన్ద్రస్వరేణ మధురేణ చ మధ్యమేన |
గానాత్మికే నిఖిలలోక మనోజ్ఞ భావే
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౦||
పాపాటవీ దహన జాగృత మానసా త్వమ్
భక్తౌఘ పాలన నిరన్తర దీక్షితాఅసి |
త్వయ్యేవ విశ్వమఖిలమ్ స్థిరతాముపైతి
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౧||
యా వైదికీ నిఖిల పావన పావనీ వాక్
యా లౌకికీ వ్యవహృతి ప్రవణా జనానామ్ |
యా కావ్యరూప కలితా తవ రూప మేతాః
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౨||
దివ్యమ్ విమాన మధిరుహ్య నభోంగణేత్ర
గాయన్తి దివ్య మహిమాన మిమే భవత్యాః |
పశ్య ప్రసీద నిచయా దివి జాంగనానామ్
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౩||
హైమీమ్ రుచమ్ సకల భూమిరుహాగ్రదేశే
ష్వాధాయ తత్కృత పరోపకృతౌ ప్రసన్నః |
భానుః కరోత్యవసరే కనకాభిషేకమ్
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౪||
దివ్యాపగాసు సరసీషు వనీ నికుంజే
ష్వుచ్చావచాని కుసుమాని మనోహరాణి |
ఫుల్లాని సన్తి పరితస్తవ పూజనాయ
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౫||
కుర్వన్తి పక్షినిచయాః కలగానమేతే
వృక్షాగ్ర మున్నతత రాసన మాశ్రయన్తః |
దేవి త్వదీయ మహిమానముదీరయన్తో
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౬||
విశ్వేశి విష్ణుభగిని శ్రుతివాక్స్వరూపే
తన్మాత్రికే నిఖిలమన్త్రమయస్వరూపే |
గానాత్మికే నిఖిలతత్త్వనిజస్వరూపే
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౭||
తేజోమయి త్రిభువనావనసక్తచిత్తే
సన్ధ్యాత్మికే సకల కాల కలా స్వరూపే |
మృత్యున్జయే జయిని నిత్యనిరన్తరాత్మన్
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౮||
త్వామేవ దేవి పరితో నిఖిలాని తన్త్రా
ణ్యాభాతి తత్త్వమఖిలమ్ భవతీమ్ వివృణ్వత్ |
త్వమ్ సర్వదాసి తరుణారుణదివ్యదేహే
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౧౯||
నిత్యాసి దేవి భవతీ నిఖిలే ప్రపన్చే
వన్ద్యాసి సర్వ భువనైః సతతోద్యతాసి |
ధీ ప్రేరికాసి భువనస్య చరాచరస్య
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౦||
వన్దామహే భగవతీమ్ భవతీమ్ భవాబ్ధి
సన్తారిణీమ్ త్రికరణైః కరుణామృతాబ్దే |
సమ్పశ్య చిన్మయతనో కరుణార్ద్ర దృష్ట్యా
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౧||
త్వమ్ మాతృకామయతనుః పరమ ప్రభావా
త్వయ్యేవ దేవి పరమః పురుషః పురాణః |
త్వత్తః సమస్త భువనాని సముల్లసన్తి
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౨||
త్వమ్ వై ప్రసూ ర్నిఖిలదేవగణస్య దేవి
త్వమ్ స్తూయసే త్రిషవణమ్ నిఖిలైశ్చ లోకైః |
త్వమ్ దేశ కాల పరమార్థ పరిస్ఫుటాసి
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౩||
త్వమ్ గాధిసూను పరమర్షి వరేణ దృష్టా
తేజోమయీ సవితు రాత్మమ యాఖిలార్థా |
సర్వార్థదా ప్రణత భక్త జనస్య శశ్వత్
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౪||
సన్కల్ప్య లోకమఖిలమ్ మనసైవ సూషే
కారుణ్యభావ కలితా అవసి లోకమాతా |
కోపాన్వితా తమఖిలమ్ కురుషే ప్రలీనమ్
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౫||
ముక్తాభ విద్రుమ సువర్ణ మహేన్ద్ర నీల
శ్వేతప్రభైర్ భువన రక్షణ బద్ధ దీక్షైః |
వక్త్రైర్యుతే నిగమ మాత రుదారసత్త్వే
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౬||
కారుణ్య వీచి నిచయామల కాన్తి కాన్తామ్
బ్రహ్మాది సర్వ దివిజేఢ్య మహాప్రభావామ్ |
ప్రీత్యా ప్రసారయ దృశమ్ మయి లోకమాతః
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౭||
శ్రీ లక్ష్మణాది గురు సత్కరుణైకలబ్ధ
విద్యా వినీత మతియానయ మాంజనేయః |
సంసేవ తేత్ర భవతీమ్ భువతీమ్ వచోభిః
గాయత్రి లోకవినుతే తవ సుప్రభాతమ్ || ౨౮||
ఇతి బహుభాషా కోవిద, సకల శాస్త్ర పారంగత, శ్రీ విద్యా గూఢజ్ఞ శ్రీ సీతారామాంజనేయ కృత గాయత్రీ సుప్రభాతమ్ ||